బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌తో పెళ్లి కోసమే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంకా చోప్రా తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఓ హాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నటించడం కోసమే ప్రియాంకా ‘భారత్’ సినిమాకు గుడ్ బై చెప్పారనే కొత్త వాదన బాలీవుడ్‌లో ఊపందుకుంది. గతేడాది ‘బేవాచ్’ సినిమాతో ప్రియాంకా చోప్రా హాలీవుడ్ బిగ్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా చిన్ని తెరకు పరిచయం అయ్యారు. ఆ షోతో మంచి మార్కులు కొట్టేసి, హాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు కొట్టేస్తున్నారు. ‘ఏ కిడ్ లైక్ ఏ జాయ్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు.
తాజాగా ఆమె హాలీవుడ్‌లో ‘కౌబాయ్ నింజా వికింగ్’ అనే సినిమాలో ‘గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ, జురాసిక్ వరల్డ్’ చిత్రాల ఫేమ్ క్రిస్ ప్రాట్‌తో జోడీ కట్టనున్నారని సమాచారం. మిచెల్ మెక్లారెన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సెప్టెంబర్ 16న నిక్ జోనస్ బర్త్ డే సందర్భంగా ప్రియాంకా, నిక్ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జూలై 18న ప్రియాంక బర్త్‌డే సందర్భంగా ఈ ఇద్దరి నిశ్చితార్థ వేడుక లండన్‌లో జరిగిందని మరో వార్త షికారు చేస్తోంది. మరి.. ప్రియాంక మౌనం వీడితేనే నిజమేంటో తెలుస్తుంది.
మౌనమేలనోయి
Published Wed, Aug 1 2018 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment