ఇక నేను వెళ్లొచ్చా; ఏంటో నన్ను ఎవరూ పట్టించుకోరు కానీ.. | Viral: Taimur Ali Khan Outing With Saif Asks Paparazzi Can I Go | Sakshi
Sakshi News home page

Taimur Ali Khan: ఏంటో నేనొస్తే ఎవరూ పట్టించుకోరు.. ​కానీ..

Published Sat, Jul 24 2021 6:23 PM | Last Updated on Sat, Jul 24 2021 7:00 PM

Viral: Taimur Ali Khan Outing With Saif Asks Paparazzi Can I Go - Sakshi

courtesy: వీరేంద్ర చావ్లా ఇన్‌స్టాగ్రామ్‌

ముంబై: బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ పెద్ద కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచే ఎంతో మందికి ఫేవరెట్‌ కిడ్‌గా మారిపోయాడు ఈ బుల్లి పటౌడీ. ఆ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు పండుగే. కెమెరా కన్నును క్లిక్కుమనిపిస్తూ సందడి చేస్తారు. తాజాగా మరోసారి తైమూర్‌ వారి కంటపడ్డాడు. తండ్రి సైఫ్‌, కజిన్‌ ఇనాయా నౌమీతో కలిసి తమ నివాసం వద్ద తైమూర్‌.. ఫొటోలకు ఫోజులిస్తూ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. 

అంతేకాదు తన ఆయాతో కలిసి కారు ఎక్కే సమయంలో.. ‘‘నేను ఇక వెళ్లొచ్చా’’అంటూ పాపరాజీల వద్ద సెలవు తీసుకుంటూ తన ముద్దు ముద్దు మాటలతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ‘‘ఏంటో నేను ఇంటి నుంచి బయటకు వస్తే ఒక్కరు కూడా పట్టించుకోరు. మరి తైమూర్‌ కనబడితే మాత్రం వామ్మో.. ఇంత హంగామా! ఏదేమైనా బుడ్డోడికి ఇప్పటి నుంచే సెలబ్రిటీ లక్షణాలు ఒంటబట్టాయి’’ అంటూ నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా అమృతాసింగ్‌తో విడాకుల అనంతరం... సైఫ్‌ అలీఖాన్‌ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2016 డిసెంబర్‌లో తైమూర్‌ జన్మించగా, సుమారు ఐదేళ్ల వ్యత్యాసం తర్వాత ఇటీవలే చిన్న కుమారుడు జెహ్‌ పుట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement