Taimur Ali Khan Pataudi
-
ఇక నేను వెళ్లొచ్చా; ఏంటో నన్ను ఎవరూ పట్టించుకోరు కానీ..
ముంబై: బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచే ఎంతో మందికి ఫేవరెట్ కిడ్‌గా మారిపోయాడు ఈ బుల్లి పటౌడీ. ఆ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు పండుగే. కెమెరా కన్నును క్లిక్కుమనిపిస్తూ సందడి చేస్తారు. తాజాగా మరోసారి తైమూర్ వారి కంటపడ్డాడు. తండ్రి సైఫ్, కజిన్ ఇనాయా నౌమీతో కలిసి తమ నివాసం వద్ద తైమూర్.. ఫొటోలకు ఫోజులిస్తూ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు తన ఆయాతో కలిసి కారు ఎక్కే సమయంలో.. ‘‘నేను ఇక వెళ్లొచ్చా’’అంటూ పాపరాజీల వద్ద సెలవు తీసుకుంటూ తన ముద్దు ముద్దు మాటలతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ‘‘ఏంటో నేను ఇంటి నుంచి బయటకు వస్తే ఒక్కరు కూడా పట్టించుకోరు. మరి తైమూర్ కనబడితే మాత్రం వామ్మో.. ఇంత హంగామా! ఏదేమైనా బుడ్డోడికి ఇప్పటి నుంచే సెలబ్రిటీ లక్షణాలు ఒంటబట్టాయి’’ అంటూ నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా అమృతాసింగ్‌తో విడాకుల అనంతరం... సైఫ్ అలీఖాన్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించగా, సుమారు ఐదేళ్ల వ్యత్యాసం తర్వాత ఇటీవలే చిన్న కుమారుడు జెహ్ పుట్టాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
‘నీ కొడుక్కి అన్నం పెడుతున్నావా.. లేదా’
చోటా నవాబ్ తైమూర్ అలీ ఖాన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తైమూర్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎలాంటి బట్టలు వేసుకున్నాడు ఇలా ప్రతి దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు జనాలు. అయితే అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారంటున్నారు కరీనా కపూర్. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో ఒకతను ‘పాపం.. తైమూర్ ఆకలితో చచ్చిపోతున్నాడు.. కరీనా తనకి ఆహారం పెట్టడం లేదు. వారు అసలు మంచి తల్లిదండ్రులే కాద’ని కామెంట్ చేశాడు. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ కల్గుతుంది. అందుకే అతనికి తగిన సమాధానం చెప్పాలని భావించాను. అందుకే తనేం ఆకలిగా లేడు. నిజం చెప్పాలంటే తైమూర్ బాగా తింటాడు. ఈ మధ్య కాస్తా బొద్దుగా కూడా అయ్యాడు’ అని సమాధానం చెప్పానన్నారు. అంతేకాక తైమూర్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ.. ‘మీడియా ఆసక్తి చూడండి. వారు చేసే ప్రచారం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా సార్లు వారు హద్దు దాటతారు. తైమూర్ విషయానికి వచ్చేసరికి ఈ అత్యుత్సాహం ఇంకాస్త ఎక్కువవుతుంది. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు. కానీ ప్రతిరోజు.. తనను ఫాలో అవ్వడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తను రెండేళ్ల పిల్లాడు. తన వ్యక్తిగత జీవితంలోకి చొరబడటమే కాకుండా పనికి మాలిన కామెంట్లు చేస్తుంటారు. వారందరిని కోరేది ఒక్కటే.. అస్తమానం తనను ఫాలో అవుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టకండి. తన బాల్యాన్ని ఆనందంగా గడపనివ్వండి’ అని తెలిపారు కరీనా. -
ఎట్టకేలకు మౌనం వీడిన హీరో
ముంబై: బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌ల కుమారుడు పుట్టగానే పాపులర్ అయ్యాడు. నెలరోజుల పసికందును బయటి ప్రపంచం పెద్దగా చూడలేదు కానీ పేరుతో వార్తల్లోకెక్కాడు. ఈ బాలుడికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అనే పేరు పెట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన టర్కీ రాజు తైమూర్ పేరును ఎందుకు పెట్టారంటూ సైఫ్-కరీనా దంపతులపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సైఫ్ ఎట్టకేలకు స్పందించాడు. ‘చరిత్ర గురించి నాకు అవగాహన ఉంది. దేశంపై దాడి చేసింది టర్కీ రాజు తైమూర్ (Timur). నా కొడుకు పేరు తాయ్మూర్ (Taimur). ఇది పర్సియన్ పేరు. దీని అర్థం ఉక్కు. ఈ పేరన్నా, దీని అర్థమన్నా నాకు, నా భార్య కరీనాకు ఇష్టం’ అని సైఫ్ చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. వారికి నచ్చినట్టుగా కామెంట్లు చేస్తారని, అయితే కొందరు ద్వేషిస్తూ పోస్టులు చేయడం తప్పని అన్నాడు. ఈ విషయంలో చాలామంది తనకు మద్దతుగా నిలిచారని చెప్పాడు. -
కరీనా దంపతులకు తైమూర్ తిప్పలు!
ముంబయి: బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌ల కుమారుడు పుట్టి పుట్టగానే పెద్ద చర్చను లేవదీశాడు. తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరుతో మరింతగా వార్తల్లో చెక్కర్లు కొడుతున్నాడు. మంగళవారం ఉదయం కరీనా, సైఫ్ దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ బాలుడికి వెంటనే తైమూర్ అలీఖాన్ పటౌడీ అంటూ నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పేరుకు అర్థం ఉక్కునట. అయితే, ఒకప్పుడు భారత దేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో పెను విధ్వంసం సృష్టించిన మంగోళ్ జాతి రాజు తైమూర్ పేరునే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం అవుతోంది. అయితే, ఈ పేరును ఎందుకు పెట్టారనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కరీనాకానీ, సైఫ్ గానీ ఇంతవరకు చెప్పలేదు. వాస్తవానికి తైమూర్ అనే పేరు భారత్‌లో సర్వసాధారణంగా వినిపించేది కాదు. ఇది పరదేశం నుంచి వచ్చిన తైమూరు అనే మంగోల్ జాతికి చెందిన వ్యక్తిది. 14 వ శతాబ్దంలో ఢిల్లీపైకి దండెత్తి వచ్చిన తైమూరు సర్వనాశనం చేశాడు. అప్పటి నుంచి ఆ పేరు అక్కడక్కడా వినిపించడం కొంతమందికి కనిపించడం జరిగింది. అయితే, కరీనా దంపతులు తమ కొడుక్కి పెట్టిన పేరు మాత్రమే మొదటిది కాదు. ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం తైమూరు అనే పేరుతో మొత్తం 5,500 మంది ఉన్నారంట. అయితే, ఆ పేరు అక్షరాల కూర్పులో మాత్రం భిన్నవిధాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క పశ్చిమబెంగాల్ లోనే 3,315మంది తైమూర్ అనే పేర్లుగలవాళ్లు ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో 588, బిహార్‌లో 558, మహారాష్ట్రలో 661, జార్ఖండ్‌లో 282, ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ఒకటి రెండు పేర్లు ఉన్నట్లు ఓట్లర్ల జాబితా ఆధారంగా తెలిసింది.