
చోటా నవాబ్ తైమూర్ అలీ ఖాన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తైమూర్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎలాంటి బట్టలు వేసుకున్నాడు ఇలా ప్రతి దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు జనాలు. అయితే అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారంటున్నారు కరీనా కపూర్. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో ఒకతను ‘పాపం.. తైమూర్ ఆకలితో చచ్చిపోతున్నాడు.. కరీనా తనకి ఆహారం పెట్టడం లేదు. వారు అసలు మంచి తల్లిదండ్రులే కాద’ని కామెంట్ చేశాడు. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ కల్గుతుంది. అందుకే అతనికి తగిన సమాధానం చెప్పాలని భావించాను. అందుకే తనేం ఆకలిగా లేడు. నిజం చెప్పాలంటే తైమూర్ బాగా తింటాడు. ఈ మధ్య కాస్తా బొద్దుగా కూడా అయ్యాడు’ అని సమాధానం చెప్పానన్నారు.
అంతేకాక తైమూర్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ.. ‘మీడియా ఆసక్తి చూడండి. వారు చేసే ప్రచారం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా సార్లు వారు హద్దు దాటతారు. తైమూర్ విషయానికి వచ్చేసరికి ఈ అత్యుత్సాహం ఇంకాస్త ఎక్కువవుతుంది. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు. కానీ ప్రతిరోజు.. తనను ఫాలో అవ్వడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తను రెండేళ్ల పిల్లాడు. తన వ్యక్తిగత జీవితంలోకి చొరబడటమే కాకుండా పనికి మాలిన కామెంట్లు చేస్తుంటారు. వారందరిని కోరేది ఒక్కటే.. అస్తమానం తనను ఫాలో అవుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టకండి. తన బాల్యాన్ని ఆనందంగా గడపనివ్వండి’ అని తెలిపారు కరీనా.
Comments
Please login to add a commentAdd a comment