షూటింగ్‌లో గాయపడ్డ ఆమిర్‌ ఖాన్‌ | Aamir Khan Suffers Rib Injury on Laal Singh Chaddha Set | Sakshi
Sakshi News home page

‘లాల్‌చద్దా’ షూటింగ్‌లో ఆమిర్‌కు గాయం

Published Mon, Oct 19 2020 1:31 PM | Last Updated on Mon, Oct 19 2020 1:38 PM

Aamir Khan Suffers Rib Injury on Laal Singh Chaddha Set - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ ఆమిర్‌ ఖాన్, కరీనా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కు ఇది హిందీ రీమేక్‌. ఈ సినిమాలో టామ్‌ హ్యాంక్స్‌ పోషించిన పాత్రలో ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముందే చాలా వరకు చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన భాగాన్ని పూర్చి చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో సినిమా షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఆమిర్‌ ఖాన్‌ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్న క్రమంలో అతని పక్కటెముకకు గాయమయినట్లు తెలుస్తోంది. అయితే షూట్‌కు ఎలాంటి ఆలస్యం కాకుదని భావించిన ఆమిర్‌ పెయిన్‌ కిల్లర్‌ తీసుకొని షూటింగ్‌ కొనసాగించినట్లు సమాచారం. చదవండి: నాలుగేళ్లు డిప్రెష‌న్‌లో ఉన్నా: 

కాగా ఇంతకుముందు కూడా ఓ ముఖ్యమైన రన్నింగ్ సీక్వెన్స్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు అమీర్ ఖాన్ ఎక్కువగా పరుగెత్తినందుకు తీవ్ర శారీరక శ్రమకు గురయ్యాడు. ఇక ఇటీవలే కరీనా కపూర్‌ రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీనా పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ ముందే పూర్తిచేయాలని చిత్రబృందం భావించింది. అలానే సెట్స్‌లో ఆమె సీన్స్‌ అన్నీ పూర్తి చేశారు. గతవారంతో కరీనా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కంప్లీట్‌ చేసి, చిత్రబృందానికి బై బై చెప్పారు. ఆమిర్‌ ఖాన్‌తోపాటు ఇతర తారలతో మిగిలిన షెడ్యూల్స్‌ను టర్కీలో చిత్రీకరించడానికి సిద్ధం అవుతోంది చిత్రబృందం. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చదవండి:ఇవేవి నా అభిరుచిని ఆపలేదు: కరీనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement