
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కి నటనపై ఎంత మక్కువ ఉందో మరోసారి నిరూపితం అయింది. జస్ట్ నెలరోజులైంది.. ఆమె ఒక బాబుకి జన్మనిచ్చి. అప్పుడే షూటింగ్‌కి రెడీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 21న ఒక బాబుకి జన్మనిచ్చారు కరీనా. ఇప్పుడు ముంబయ్‌లోని బాంద్రాలో ఓ సినిమా షూటింగ్‌కు హాజరయ్యారామె. ఆ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ పెళ్లి చేసుకోగా 2016లో తొలి సంతానంగా తైముర్ అలీఖాన్ జన్మించిన విషయం తెలిసిందే. ఇక కరీనా సినిమాల విషయానికొస్తే.. ఆమిర్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘లాల్‌సింగ్ చద్దా’తో పాటు రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ‘సీత – ది ఇన్ కార్నేషన్’ సినిమాలో నటిస్తున్నారు కరీనా కపూర్.
Comments
Please login to add a commentAdd a comment