2001లో వచ్చిన బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలోని బోలే చుడియాన్ అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్, కరీనా కపూర్ కాజోల్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్ఛన్, జయ బచ్చన్కనిపించిన ఈ పాట అందరి నోళ్లలో తెగ నానిపోయింది. ఇటీవల ఈ పాటకు ఇండోనేషియా డ్యాన్సర్స్ గ్రూప్ మరోసారిడాన్స్ చేసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. వినా అభిమాని అనే యూట్యూమర్ అచ్చం కరీనా కపూర్ లాగే వేషధారణ, ఎక్స్‌ప్రెషన్స్, వేషాధారణ కూడా రీక్రియేట్ చేసిన ఈ పాటను తన యూట్యూబ్ ఛానల్‌లో గతవారం విడుదల చేసింది. 8 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో ప్రతి సీన్‌ను అచ్చం సినిమాలోని మాదిరిగానే చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కొక్కరు ఒక్కో వేషధారణతో ఇండోనేషియా డ్యాన్స్ గ్రూప్ ఈ పాటను రీక్రియేట్ చేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. (బీటౌన్‌లో 'బిగ్‌బాస్' సందడి)
యూట్యూబ్‌లో బోలె చూడియన్ రిక్రియేషన్ పాట 1.6 మిలియన్ల వ్యూవ్స్, 1.2 లక్షల లైక్స్, వందల కామెంట్లు సంపాదించింది.బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో పాటు ధర్మ ప్రొడకక్షన్స్ నుంచి కూడా ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ పాట వైరల్‌గా మారింది. ధర్మ ప్రొడక్షన్స్ కూడా తమ ఇన్‌స్టాగ్రామ స్టోరీస్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. మరో వైపు ఈ పాటను రీక్రియేట చేసిన వీనా ఫ్యాన్‌ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పాటకు వచ్చిన ప్రశంసలపై ఆదివారం స్పందించారు. అందరినుంచి వస్తున్న సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ వీడియోనే పలుసార్లు వీక్షిస్తూ సోషల్ మీడియాలో షేర్‌చేస్తున్నారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. (పార్లమెంట్‌లో గళమెత్తిన ‘రేసుగుర్రం విలన్’)
Comments
Please login to add a commentAdd a comment