
హైదరాబాద్: బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌లు తన అభిమాన నటీమణులని టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. సహచర క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్న ధావన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన కెరీర్‌లో దక్షిణాఫ్రికా స్పీడస్టర్ డేల్ స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో చాలా ఇబ్బందులు పడ్డట్లు తెలిపాడు. అతను అత్యుత్తమ బౌలర్ అని పేర్కొన్న ధావన్ ప్రపంచకప్-2019లో ఆస్ట్రేలియాపై చేసిన సెంచరీ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించాడు.
చేతి గాయం బాధించినా జట్టు కోసం పోరాడి ఆడానని, సెంచరీ సాధించానని అందుకే తన కెరీర్‌లో ప్రత్యేకమైన శతకంగా అది నిలుస్తుందన్నాడు. ఇక సంగీతమంటే ఎంతో ఇష్టమని చెప్పడంతో అయ్యర్ కోరిక మేరకు లైవ్‌లో ఫ్లూట్(పిల్లన గ్రోవి) వాయించాడు. సంగీతమంటే ఇష్టమున్నవాళ్లు, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకునేవారికి ఈ లాక్‌డౌన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫ్లూట్ నేర్చుకుంటున్నానని తెలిపాడు. ఇక లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్న ధావన్.. తన పాటలు, డ్యాన్స్‌లు, పిల్ల చేష్టలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment