
Indian Squad Members Tested Positive For Covid: విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగింది. జట్టులోని స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌లు సహా మరో 5 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఓ ప్రముఖ క్రీడా వార్తల సంస్థ వెల్లడించింది. ఈ విషయంపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. కాగా, విండీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమిండియా గత శనివారమే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఈనెల 6న తొలి వన్డే జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment