సౌత్ ఎంట్రీపై రూమర్స్.. హింట్ ఇచ్చిన కరీనా | Sakshi
Sakshi News home page

సౌత్ ఎంట్రీపై రూమర్స్.. హింట్ ఇచ్చిన కరీనా

Published Tue, Mar 19 2024 1:37 AM

Kareena Kapoor To Join KGF Star Yash in Toxic - Sakshi

ఉత్తరాది హీరోయిన్లు శిల్పా శెట్టి, ప్రీతీ జింతా, రవీనా టాండన్, కత్రినా కైఫ్‌ వంటివారు గతంలో సౌత్‌లో సినిమాలు చేశారు. ఆ తర్వాత కంగనా రనౌత్, ఈ రెండు మూడేళ్లల్లో శ్రద్ధా కపూర్, అలియా భట్‌ వంటి వారు దక్షిణాదిలో.. మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో నటించారు. తాజాగా ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’తో దీపికా పదుకోన్, ఎన్టీఆర్‌ ‘దేవర’తో జాన్వీ కపూర్‌ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక మరో బాలీవుడ్‌ ప్రముఖ తార కరీనా కపూర్‌ సౌత్‌ సినిమాకి సై అన్నారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్‌’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కరీనా.. యశ్‌తో నటించాలనుంది అన్నారు. అలాగే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ‘‘దక్షిణాదిలోని ఓ స్టార్‌ హీరో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్‌ మూవీ. షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని కరీనా చెప్పారు. దాంతో ‘టాక్సిక్‌’ చిత్రాన్ని ఉద్దేశించే ఆమె ఈ విధంగా పేర్కొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement