ముంబై: బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్‌లకు సంబంధించి ఓ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఓ ప్లాస్టిక్ పైపులు, నీటి నిల్వ ఉంచే ట్యాంకుల తయారి సంస్థ ప్రమోషన కోసం చేసని ప్రకటన. గినా ఖోల్కర్ అనే ట్విటర్ యూజర్ శనివారం షేర్ చేశాడు. దీనికి ’ప్రపంచంలోనే అద్భుతమైన నీళ్ల ట్యాంక్’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. 30 సెకన్ల నిడివి గల వీడియోను సైఫ్, కరీనాలు రాయల్ దుస్తుల్లో డైనింగ్ టెబుల్ వద్ద కుర్చోని భోజనం చేస్తున్నట్లుగా కనిపించారు. (చదవండి: ‘20 ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నా’)
World's Greatest Paani Ki Tanki Ad. pic.twitter.com/1WgDDYp1hR
— Gina Kholkar (@BabaJogeshwari) July 17, 2020
ఈ క్రమంలో సైఫ్, కరీనాతో ‘మనీద్దరం కలిసి నటించి చాలా రోజులైంది కదా అని అడగ్గా... ఇంట్లో రోమాన్స్‌యే, బయట కూడా అంటూ కరీనా కాస్తా విసుగ్గా అనడంతో సైఫ్ హా అది తెలుసు అది ఎక్కువైందా అంటూ కరీనాను ఉడికిస్తాడు. అయితే నా దగ్గర ఒక్క ఐడియా ఉంది అయితే మనీద్దరం కలిసి ఓ ప్రకటన చెద్దామా’ అంటూ కరీనా కూల్ చేస్తాడు. ఇక ఈ వీడియో చూసిన ఈ స్టార్ జంట అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత వారిని స్క్రీన్‌పై చూసి మురిసిపోతుంటే మరికొందరూ వీరి సోంత వాయిస్‌ను పెట్టకుండా డబ్బింగ్ ఎందుకు పెట్టారు అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ జంటను విక్టస్ ప్లాస్టిక్ కంపేనీ జూలై 8వ తేదీన తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌లు సైఫ్-కరీనాలను ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: మొరాకో వీధుల్లో కరీనా, సైఫ్ జంట!)
Comments
Please login to add a commentAdd a comment