అంతా సెట్లోనే! | Lal Singh Chadha has resumed shooting after Kareena Kapoor pregnant | Sakshi
Sakshi News home page

అంతా సెట్లోనే!

Published Thu, Sep 24 2020 1:19 AM | Last Updated on Thu, Sep 24 2020 1:19 AM

కరీనా కపూర్‌ - Sakshi

ఆమిర్‌ ఖాన్, కరీనా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కు ఇది హిందీ రీమేక్‌. ఈ సినిమాలో టామ్‌ హ్యాంక్స్‌ పోషించిన పాత్రలో ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముందే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని టర్కీలో పూర్తి చేయాలనుకుంటున్నారు. అయితే ఇటీవలే కరీనా కపూర్‌ రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు.

నెలలు గడిచేకొద్దీ కరీనా శరీరాకృతిలో మార్పులు వచ్చేస్తాయి కాబట్టి, త్వరలో ఆమె పాత్ర చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ వారంలోనే కరీనా కపూర్‌ చిత్రీకరణలో పాల్గొంటారట. కరీనాకు సంబంధించిన సీన్స్‌ని సెట్లోనే పూర్తి చేయడానికి ప్లాన్‌ చేశారని సమాచారం. ఆ భాగం పూర్తయితే టీమ్‌ టర్కీ ప్రయాణం అవుతుంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement