
ఆమిర్ ఖాన్, జీనత్
కొత్త సినిమా కోసం కొత్త ప్రయాణం మొదలు పెట్టారు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ (1994)కి హిందీ రీమేక్ ఇది. ఇందులో కరీనా కపూర్ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి సన్నివేశానికి ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ క్లాప్ ఇచ్చారు. హిందీ చిత్రం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమిర్ ఖాన్ దాదాపు 20కేజీల బరువు తగ్గిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment