![Aamir Khan Laal Singh Chaddha Postponed - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/21/amir-khan.jpg.webp?itok=Js6KuZRW)
ఆమిర్ ఖాన్
ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రావాలన్నది లాల్ సింగ్ చద్దా ప్లాన్. కానీ ఆ ప్లాన్‌లో మార్పు ఉండబోతోందని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్ కథానాయిక. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఆమిర్ ఖాన్. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడటంతో ‘లాల్ సింగ్ చద్దా’ను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. మరి లాల్ సింగ్ అనుకున్న టైమ్‌కి వస్తాడా? రాడా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment