
ముంబై: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా వ్యాప్తి నివారణకై తీసుకోవాల్సిన చర్యల గురించి సోషల్ మీడియాలో అభిమానులను చైతన్యవంతం చేస్తున్నారు. మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల వినియోగం గురించి వివరిస్తూ పలు వీడియోలు రూపొందిస్తున్నారు. అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విసిరిన ‘సేఫ్ హ్యాండ్స్’ (#SafeHands) చాలెంజ్‌ను పూర్తి చేస్తూ దాని ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తిలో కీలక పాత్ర పోషించే షేక్‌హ్యాండ్ గురించి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తనదైన శైలిలో స్పందించారు.(‘కరోనా’ పై కొత్త చాలెంజ్.. భారీ స్పందన)
ఈ మేరకు తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కరీనా.. ‘‘ ఎవరైనా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించినపుడు.. నేను’’అంటూ క్యాప్షన్ జతచేశారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక కరోనా కట్టడిపై కరీనా స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘ఈ ఫొటో చూస్తుంటే.. తైమూర్ గుర్తుకు వస్తున్నాడు. మీరప్పుడు ఎంతో ముద్దుగా.. బొద్దుగా ఉన్నారు. అవును మీరన్నట్లు షేక్‌హ్యాండ్‌కు నో చెప్పాల్సిందే’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కరీనా కపూర్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. అనతికాలంలో 2 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఆమె.. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఈ హాట్‌బ్యూటీ కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (అక్కడ మాకు స్క్రీనింగ్ చేయలేదు: హీరోయిన్)
‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’
Comments
Please login to add a commentAdd a comment