Private School Asked Kareena Kapoor Son Full Name In Exam, See What Happens Next - Sakshi
Sakshi News home page

Kareena Kapoor: కరీనా కొడుకు పూర్తి పేరేంటి? క్వశ్చన్‌ పేపర్‌ చూసి అవాక్కైన విద్యార్థులు

Published Sat, Dec 25 2021 7:10 PM | Last Updated on Sat, Dec 25 2021 8:34 PM

Private School Asked Kareena Kapoor Son Full Name In Exam, Goes Viral - Sakshi

సైఫ్‌ అలీఖాన్‌- కరీనా కపూర్‌ దంపతుల కొడుకు పూర్తి పేరు ఏమిటి? ఇంతకీ ఫస్టా? సెకండా? అని అడగకండి. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది మేము కాదు మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్‌. ఆరవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన క్వశ్చన్‌ పేపర్‌లో పై ప్రశ్న ఉంది. దాన్ని కొందరు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.

ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇవేం పిచ్చిప్రశ్నలని స్కూల్‌ యాజమాన్యంపై ఫైర్‌ అవుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే కరీనా కొడుకు పేరేంటి? అన్న పాఠశాల యాజమాన్యం ఆమెకు ఇద్దరు సంతానం అన్న సంగతి కూడా మరిచింది.  కాగా బాలీవుడ్‌ జంట సైఫ్‌ - కరీనా దంపతులకు తైమూర్‌ అలీ ఖాన్‌, జెహ్‌లు సంతానం. జెహ్‌ పూర్తి పేరు జెహంగీర్‌ అలీ ఖాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement