OTT: ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’ మూవీ రివ్యూ | 'The Buckingham Murders' Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

The Buckingham Murders: ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’ మూవీ రివ్యూ

Published Tue, Dec 3 2024 12:38 PM | Last Updated on Tue, Dec 3 2024 12:48 PM

'The Buckingham Murders' Movie Review In Telugu

నేరం ఎక్కడ జరిగినా నేరస్తుడి కోణం లో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ది బకింగ్ హామ్ మర్డర్స్.  ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. 2023సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ నాడు జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూపొందించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారి అయిన జస్మీత్ భమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించడం విశేషం. 

ఇక ఈ సినిమా కథాంశానికొస్తే.. జస్మీత్ ఓ బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మీత్ బకింగ్ హామ్ నగరానికి కు ట్రాన్సఫర్ చేయించుకుంటుంది. బకింగ్ హామ్ కు రావడం తోనే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్ హామ్ లో నివాసం వుంటున్న దల్జీత్, ప్రీతి కొల్లి దత్తపుత్రుడు ఇష్ ప్రీత కనబడడం లేదని ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మీత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటయితే ఈ కేసు లో డ్రగ్స్ పాత్ర ఉండడం రెండవ కారణం. 

ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మీత్ ఎలా సాల్వ్ చేస్తున్నదే మిగతా సినిమా. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు. కాని ఈ సినిమా చూసేకొద్దీ చూస్తున్నవాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్ ప్లే ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. కరీనాకపూర్ ఈ పాత్రలో జీవించందనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు మూడు వారాల నుండి టాప్ 10 లో నిలిచింది. వర్తఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ వాచిట్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement