
స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించిన సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ తనపై వచ్చిన పుకార్లపై స్పందించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న రామాయణం సినిమాలో కరీనా సీత పాత్రకు ఎంపికయ్యిందని, అయితే ఈ పాత్ర కోసం ఆమె అక్షరాలా రూ. 12కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ రూమర్స్‌పై కరీనా స్పందిస్తూ.. నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. అలాంటప్పుడు నేనెలా డిమాండ్ చేస్తా? ఇలాంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో కూడా అర్థం కావడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరికి నచ్చింది వాళ్లు రాసేసుకుంటున్నారు. కాస్త నిజాలు తెలుసుకొని రాస్తే బావుంటుంది అంటూ ఘాటుగా బదులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment