
సిమ్లా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్‌లకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి గతవారం హిమచల్ ప్రదేశ్ పాలంపూర్ పర్యటనకు వెళ్లారు. హిల్ స్టేషన్‌లో ఈ స్టార్ జంట ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం పాలంపూర్ నుంచి ముంబైకి తిరుగు పయనం అవుతున్న సందర్భంగా కరీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ డెనీమ్ టీ షర్ట్ ధరించి చలికాలం ఎండలో సేదతీరుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘బై బై పాలంపూర్.. అద్భుతమైన అనుభూతి.. హాలో ముంబై.. ఇంటికి వచ్చేస్తున్నా’ అంటూ హార్ట్ ఎమోజీని జోడించారు. (చదవండి: ‘అంతిమ్’ ఫస్ట్‌లుక్.. సరికొత్త గెటప్‌లో సల్మాన్)
అంతేగాక పాలంపూర్‌లో ఈ జంట స్నేహితులతో కలిసి దిగిన పలు ఫొటోలను కూడా కరీనా పంచుకున్నారు. కాగా దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం ‘అంగ్రేజీ మీడియం’ చిత్రంలో కరీనా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత హీరో అమిర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చందా’లో నటిస్తున్నారు. అయితే మరోసారి గర్భం దాల్చిన కరీనా లాల్ సింగ్ చందాలోని తన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా 2012లో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న కరీనా 2012 తైమూర్ అలీఖాన్‌కు జన్మనించారు. మరో రెండు నెలల్లో తన రెండవ బిడ్డకు కరీనా జన్మినివ్వనున్నారు. (చదవండి: వ్యవసాయం చేస్తున్న తైమూర్, సైఫ్)