
Aamir Khan Laal Sing Chaddha New Release Date Out: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ఇప్పుడు ప్రేమికుల దినోత్సవానికి బదులు ఏప్రిల్ 14, 2022న థియేటర్లలోకి రానుంది. ఈ విషయమై మేకర్స్ శనివారం ప్రకటించారు. ఈ చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్' (2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత‍్వం వహించారు. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది ప్రొడక్షన్ బ్యానర్.
We are happy to share our new poster and our new release date :) #LaalSinghOnBaisakhi#AamirKhan #KareenaKapoorKhan #AdvaitChandan @atul_kulkarni @ipritamofficial @OfficialAMITABH #KiranRao @Viacom18Studios @chay_akkineni #MonaSingh #ManavVij #SatyajitPande #HemantiSarkar pic.twitter.com/VOz3RBjHZz
— Aamir Khan Productions (@AKPPL_Official) November 20, 2021
'మా కొత్త పోస్టర్, మా కొత్త విడుదల తేదిని ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది' అని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ కారణంగా లాల్ సింగ్ చద్దా చాలా సార్లు వాయిదా పడింది. ఈ చిత్రం 2021 క్రిస్మస్‌కు విడుదల కావాల్సింది. అయితే కొవిడ్ వల్ల షూటింగ్ నిలిపివేయడంతో ఆలస్యమైంది. టీమ్ ప్రొడక్షన్ సెప్టెంబర్‌లో పూర్తైంది. విన్‌స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా 'ఫారెస్ట్ గంప్' ని తెరకెక్కించారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమాకు ఎరిక్ రోత్, రచయిత అతుల్ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, మోనా సింగ్ తదితరులు కూడా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment