‘డెలివరీ సూన్’ అంటున్నారు కరీనా కపూర్. తన ప్రెగ్నెన్సీ గురించి ఇలా అని ఉంటారని అనుకుంటున్నారు కదూ! కాదు.. తాను రాస్తున్న పుస్తకం గురించి ఇలా అన్నారామె. ప్రెగ్నెన్సీ మీద ఓ పుస్తకం రాయబోతున్నట్లు తన కుమారుడు తైముర్ పుట్టినరోజు (డిసెంబర్ 20) సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం కరీనా రెండోసారి గర్భవతిగా ఉన్నారు.
గర్భవతిగా ఉన్న సమయంలో పాటించాల్సిన నియమాలు, తన అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకోనున్నారు. ‘‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకాన్ని ప్రకటించడానికి ఇదే మంచి రోజు అనిపించింది. నా ప్రెగ్నెన్సీ సమయంలో నేను పాటించిన విషయాలన్నీ మీతో పంచుకుంటాను. ఈ పుస్తకం చాలామందిని గైడ్ చేస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు కరీనా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పుస్తకం మార్కెట్‌లోకి రానుంది.
డెలివరీ సూన్!
Published Mon, Dec 21 2020 3:53 AM | Last Updated on Mon, Dec 21 2020 3:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment