బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి హిందీలో ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించి చాలాకాలమే అయింది. గెస్ట్ రోల్‌లో లేదంటే ఏదైనా కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడే తప్ప హీరోగా మాత్రం నటించడం లేదు. అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ దక్షిణాదికి దగ్గరయ్యాన్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'ఎక్కువ నిడివి ఉండే పాత్రలు చేసి చాలాకాలమైంది. దీంతో నాకసలు క్రాఫ్ట్స్ గుర్తున్నాయా? మర్చిపోయానా? నాకంటూ అభిమానులున్నారా? అన్న సందేహాలు వస్తుంటాయి. కానీ ఎక్కడికెళ్లినా ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తుంటారనుకోండి. నా పిల్లలు కూడా మెయిన్ లీడ్‌లో సినిమాలెందుకు చేయట్లేదు? అని అడుగుతుంటారు. నేను గతంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. అయినా సరే ఏం పర్లేదని ఆ చెత్త చూద్దామని ఎవరూ డబ్బులు పెట్టి టికెట్ కొనరు కదా! ప్రేక్షకుల దాకా ఎందుకు? యాక్షన్ సీన్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్లే నా సినిమాను పక్కన పడేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, వర్షంలో డ్యాన్సులు లాంటివి ఉంటేనే సినిమా తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నారు. అందుకే నేను మెయిన్ లీడ్‌లో సినిమాలు చేయడం మానేశా' అని చెప్పుకొచ్చాడు.
కాగా 1992లో వచ్చిన బల్వాన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సునీల్ శెట్టి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయన హిందీలో చివరగా ఎ జెంటిల్‌మెన్(2017) అనే సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ పాత్రలో నటించారు. ఇటీవలే ధారావి బ్యాంక్ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించాడు. ప్రస్తుతం హిందీలో నాలుగు చిత్రాలు చేస్తున్నాడు
చదవండి: వారీసు వర్సెస్ తునివు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
తండ్రి చనిపోయినా సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment