ఆమెకు 50, అతడికి 38.. లవ్‌పై ట్రోలింగ్‌.. హీరో ఏమన్నాడంటే? | Arjun Kapoor: Those Who Troll Dying for Selfies With Me and Malaika Arora | Sakshi
Sakshi News home page

Arjun Kapoor: 21 ఏళ్ల కుమారుడున్న బాలీవుడ్‌ బ్యూటీతో రిలేషన్‌.. ట్రోలింగ్‌పై హీరో రియాక్షన్‌ ఇదే!

Published Thu, Dec 14 2023 1:02 PM | Last Updated on Thu, Dec 14 2023 5:51 PM

Arjun Kapoor: Those Who Troll Dying for Selfies With Me and Malaika Arora - Sakshi

సెలబ్రిటీలను ఇష్టపడేవాళ్లుంటారు.. ఉత్తి పుణ్యానికే వాళ్లపై విమర్శలు గుప్పించేవాళ్లూ ఉంటారు. వారు ఏదైనా ఫోటో షేర్‌ చేసినా, బయటకు వెళ్లినా, ఖరీదైన వస్తువులు కొన్నా, బ్రాండెడ్‌ అండ్‌ వెరైటీ డ్రెస్సులు వేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ప్రియురాలికి బ్రేకప్‌ చెప్పినా, భార్యకు విడాకులిచ్చినా.. ఏం చేసినా సరే తిట్లదండకం అందుకోవడానికి రెడీగా ఉంటారు.

ఆమెకు 50 అతడికి 38..
అలా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌ బారిన పడేవారిలో హీరో అర్జున్‌ కపూర్‌ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్‌ డ్యాన్సర్‌, బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50. గతంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. కానీ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్‌ కపూర్‌కు మరింత దగ్గరైంది మలైకా.

వయసు వ్యత్యాసంపై ట్రోలింగ్‌
అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకును తీసుకొచ్చే అమ్మాయిని పార్ట్‌నర్‌గా ఎంచుకోవడమేంటి? నీకంటే 12 ఏళ్లు పెద్ద.. అలాంటి ఆంటీతో లవ్వేంటి? అని నెటిజన్లు తరచూ సూటిపోటి మాటలతో అర్జున్‌ను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్‌ కరణ్‌ 8వ సీజన్‌లో పాల్గొన్న అర్జున్‌ ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. 'ట్రోలింగ్‌ వల్ల ఎప్పుడో ఒకసారైనా బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఎలా డీల్‌ చేస్తామనేది ముఖ్యం.

లైకుల కోసం చిల్లరపనులు..
ఈ ట్రోలింగ్‌ వల్ల.. తప్పుడు కామెంట్లు చేసేవారి పద్ధతులు, వక్రబుద్ధి బయటపడుతుంది. ఏదిపడితే అది కామెంట్లు చేసి మన దృష్టిని ఎలాగోలా ఆకర్షించాలనుకుంటారు. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు స్పందించాలనుకున్నాను. కానీ వారికి నేను అటెన్షన్‌ ఇవ్వడమేంటని తర్వాత లైట్‌ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తుంటారు. మళ్లీ ఇలాంటివారే మనం కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతారు' అని అర్జున్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: వీరప్పన్‌ స్వయంగా చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్‌.. అక్కడే స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement