
మలైకా అరోరా.. పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌లో కెవ్వుకేక పాటతో ఇటు టాలీవుడ్‌కు.. ఐటంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు పరిచయం చేయక్కర్లేని పేరు. లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
దీన్ని చూసిన కొంతమంది అభిమానులు.. ఎంతందంగా ఉన్నావే.. అని పాట పాడుకుంటుంటే, మరికొందరేమో ‘ఛీ.. మేకప్‌తో చూడలేకున్నాం. మేకప్ లేకుండానే బాగుందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు మాత్రం ‘ఈ ఫొటోలో మరీ ముసలిదానిలా కనిపిస్తున్నావు’ అంటూ మలైకాను ఆడేసుకుంటున్నారు. మలైకా ఈ ఫొటోలో అచ్చు బాలీవుడ్ సెన్సేషన్ రణు మొండాల్‌లా ఉందంటూ ఆమెతో పోల్చుతూ చురకలంటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment