
Malaika Arora Black Water Drink: బ్లాక్ వాటర్ ఎప్పుడైనా తాగారా? ఇదేంటి మినరల్ వాటర్ తెలుసు, రోజ్‌వాటర్ తెలుసు కానీ.. బ్లాక్ వాటర్ ఏంటి అంటారా? ఈ మధ్య కాలంలో ఈ వాటర్‌కి బాగా డిమాండ్ పెరిగింది. సెలిబ్రిటీలు ఈ వాటర్‌ని తాగేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు. తాజాగా తాజాగా బాలీవుడ్ నటి మలైకా ఆరోరా సైతం ఈ బ్లాక్‌వాటర్‌నే తాగుతుంది. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో బ్లాక్ వాటర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. బ్లాక్ వాటర్ స్పెషల్ ఏంటి? ఈ నలుపు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాటర్ ధర ఎంత? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
(చదవండి: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్)
సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్‌కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది. లీటర్ బ్లాక్ వాటర్ బాటిల్‌కు దాదాపు రూ. 100 ఉంటుందట. ఈ వాటర్‌లో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీటర్ బ్లాక్ వాటర్‌లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.