![Malaika Arora On Becoming Single Mother After Divorce With Arbaaz Khan - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/12/malaik.gif.webp?itok=xSXq-iuG)
Malaika Arora Comments About Working As Single Mother: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ఈ హాట్ బ్యూటీ తాజాగా తన విడాకుల గురించి తొలిసారి నోరు విప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. సింగిల్ మదర్‌గా నా కొడుకును సరిగ్గా పెంచగలనా లేదా అని చాలాసార్లు ఆలోచించాను. తల్లిగా నీ బాధ్యతని ఎలా నిర్వహించబోతున్నావని ప్రపంచం మొత్తం నన్ను అడుగుతున్నట్లు అనిపించింది.
ఈ ఆలోచనలన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రపంచం మొత్తం క్రాష్ అవుతున్నట్లు అనిపించేది. కానీ ఒకరోజు ముందడుగు వేసి నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం నేను సింగిల్ మదర్‌ని. అదే నన్ను ఇంకా బాధ్యతగా ఉండేలా చేస్తోంది. కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మలైకా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక మలైకా-అర్బాజ్‌లకు 1998లో వివాహం అయ్యింది. 19 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుండగా.. అర్బాజ్ ఇటాలియన్ మోడల్‌తో రిలేషన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment