
ముంబై: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ బాలీవుడ్ నటి, డాన్సర్ మలైకా అరోరా తాజాగా ఓ స్టన్నింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీకెండ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ పోస్టు చేసిన ఈ ఫొటోలో ఎరుపురంగు గౌనులో మలైకా తళుక్కున మెరిసిపోతున్నారు. ఈ వారాంతం మిమ్మల్ని కలవనున్నాననే క్యాప్షన్‌ను కూడా ఆమె ఈ ఫొటోకు జోడించారు. బాలీవుడ్‌లో ఎప్పుడూ పూర్తిస్థాయి హీరోయిన్‌గా మలైకా నటించకపోయినప్పటికీ.. ప్రత్యేక పాటలు, డాన్స్ రియాలిటీ షోలతో 'ఛయ్య..ఛయ్య' గాళ్‌గా ఫేమస్ అయ్యారు. తనకంటే వయస్సులో చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరు జంటగా కనిపిస్తూ.. విహారాలకు వెళ్తూ.. మీడియాలో హాట్ న్యూస్‌గా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment