బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్‌లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్‌లో టాలీవుడ్‌ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్‌లో గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్‌నెస్‌తో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.
మలైకా అరోరా ఫినెస్‌కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్ ఫిజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్ సెషన్‌ని స్కిప్ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్ ఖాన్‌తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది.
ఏ మాత్రం ఫిగర్‌ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్‌బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్‌లు, జంపింగ్ జాక్‌లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకుంటుంది.
ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్ శాండ్‌విచ్‌లు తీసుకుంటుంది. లంచ్‌లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్, మాంసం, చేపలు, చికెన్ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది.
తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్‌తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!.
Comments
Please login to add a commentAdd a comment