Physique
-
ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్గా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్‌లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్‌ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్లో గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్నెస్తో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.మలైకా అరోరా ఫినెస్కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్ ఫిజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్ సెషన్‌ని స్కిప్ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్ ఖాన్‌తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది. ఏ మాత్రం ఫిగర్‌ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్‌బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్లు, జంపింగ్ జాక్‌లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకుంటుంది. ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్ శాండ్విచ్లు తీసుకుంటుంది. లంచ్‌లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్, మాంసం, చేపలు, చికెన్ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది. తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్‌తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!. (చదవండి: ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?) -
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
కూతురిపైనా ట్రంప్ కారుకూతలు
• ఇవాంకా శరీర సౌష్టవంపై అసభ్య వ్యాఖ్యలు • తెరపైకి ట్రంప్ పాత ఇంటర్వ్యూ వీడియోలు • ఈ వ్యాఖ్యలు సరికావు: ట్రంప్ భార్య మెలానియా వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే.. ఏకంగా తన కూతురిపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటపడటంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 17 ఏళ్ల క్రితం హోవార్డ్ స్టెర్న్ అనే రేడియో జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూ బహిర్గతమైంది. ఈ ఇంటర్వ్యూలో తన కూతురు ఇవాంకా ట్రంప్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎత్తు, బరువుతో పాటు శరీర సౌష్టవం చక్కగా ఉందని చాలాసార్లు ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఆ వీడియోలో ‘చాలా మంది మహిళలు నేనంటే పడిచచ్చేవారు. నాకోసం ఏం చేసేందుకైనా వెనుకాడేవారుకాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2006లో మరో ఇంటర్వ్యూలోనూ తన కూతురు మరింత సెక్సీగా కనబడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎన్ఎన్ ప్రచురించింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఆయన భార్య మెలానియా ట్రంప్ అన్నారు. అయితే, ఇదంతా గతమని.. అప్పటికీ, ఇప్పటికీ తన భర్త చాలా మారారన్న మెలానియా.. ట్రంప్ క్షమాపణలు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. క్లింటన్‌కు భారతీయ అమెరికన్ల మద్దతు మహిళలపై వ్యాఖ్యలతో సొంతపార్టీతోపాటు జనాల్లోనూ ట్రంప్ పట్టుకోల్పోతున్నారు. తాజా వీడియోతో.. భారత అమెరికన్లు చాలా మంది క్లింటన్‌కు మద్దతు ప్రకటించారు. మెజారిటీ భారతీయ అమెరికన్లు మొదట్నుంచీ డెమొక్రాట్లకే మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ ఉగ్రవాదం, ఇస్లామిక్ టైస్టులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఓ వర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరూ హిల్లరీకే మద్దతు తెలిపారు. ‘ట్రంప్‌ను శ్వేతసౌధం చేరకుండా ఆపాలి.మహిళలపై ఆయన వ్యాఖ్యలు దారుణం. తల్లి, చెల్లి, భార్య, సమాజంపై గౌరవం లేని వ్యక్తి ట్రంప్’ అని కమలా హారిస్ (కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు పోటీ పడుతున్న భారత సంతతి మహిళ) తెలిపారు. హిల్లరీకే చాన్స్: నిపుణులు డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులంటున్నారు. ఫ్లోరిడాతోపాటు పెద్ద రాష్ట్రాలైన ఉత్తర కరోలినా, ఒహియో, పెన్సిల్వేనియాలో ఏదైనా ఒక రాష్ట్రంలో గెలిస్తే సరిపోతుందని తెలిపారు. ఆదివారం రాత్రి జరిగే రెండో ‘అధ్యక్ష అభ్యర్థుల డిబేట్’లో హిల్లరీ గెలుస్తుందన్నారు. ట్రంప్‌ను ఎలా తప్పించాలి?: నెల రోజుల్లో ఎన్నికలుండగా అభ్యర్థిగా ట్రంప్‌ను తప్పించాలని పార్టీ పావులు కదుపుతోంది. కీలకనేతలు సహా మెజారిటీ సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండటంతో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) ఈ దిశగా అన్ని న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తోంది. ‘పార్టీ నిబంధనల్లోని 9వ నియమం ప్రకారం ఆర్ఎన్సీలో ఓటింగ్ ద్వారా అధ్యక్ష అభ్యర్థిని మార్చవచ్చు. దీనికి అభ్యర్థి చనిపోవటమో, ఆరోగ్యం క్షీణించటమో లేదా ఇతర కారణాలను చూపించో తప్పించవచ్చు’ అని పార్టీ చెబుతోంది. ట్రంప్ తనంతటతానుగా తప్పుకోవటం లేదా, 168 మంది డెలిగేట్లున్న ఆర్ఎన్సీ భేటీలో పూర్తిస్థాయి మెజారిటీ లభిస్తే.. కొత్త అభ్యర్థిని (ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న మైక్ పెన్స్) బరిలో దించే వీలుంది. ట్రంప్‌కు దూరమవుతున్న రిపబ్లికన్లు ట్రంప్‌కు సొంతగూటిలో కుంపటి రాజుకుంటోంది. రిపబ్లికన్ పార్టీలోని కీలక నేతలు (సెనెటర్లు, గవర్నర్లు) ట్రంప్ శిబిరం నుంచి దూరమవుతున్నారు. ఎన్నికలనుంచి తప్పుకోవాలని పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన కలలు కూడా ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. ‘ఇకచాలు. ట్రంప్ తప్పుకోవాలి’ అంటూ మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ ఫేస్బుక్లో తెలిపారు. కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్, ఒహియో సెనెటర్ రాబ్ పోర్ట్మాన్, దక్షిణ డకోటా గవర్నర్ డెన్నిస్ డగర్డ్ తదితరులు బహిరంగంగానే ట్రంప్‌కు దూరమవుతున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ మాత్రం జాగ్రత్తగా మాట్లాడారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కానీ ఆయన గొప్ప మనసుతో క్షమాపణలు కోరారు. ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగే రెండో డిబేట్లో ఆయనే దేశానికి సమాధానం చెబుతారు’ అని తెలిపారు. కీలకదశకు ఎన్నికలు అధ్యక్ష్య ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. అమెరికా ఎన్నికల చరిత్రలోనే గత సాంప్రదాయానికి భిన్నంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మీడియా పేర్కొంది. ఇద్దరు అసమర్థ అభ్యర్థులు బరిలో ఉన్నారంటూ ఓటర్లంటున్నారు. ఇటీవలి ఓ సర్వేలో 55 శాతం మంది హిల్లరీ, ట్రంప్‌లపై అభ్యంతరం తెలిపారు. ఆయా పార్టీల్లోనూ వీరిద్దరిపై సానుకూల అభిప్రాయం లేదు. -
ఈ వైరుధ్యమే కారణం!
ఆశీర్వాదాలు అందడంలో ఆలస్యానికి గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీ రాని గొర్రెల కాపరియైన దావీదు, విశ్వాసియైన తన ముందు అన్యుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిసెలతో చిన్నరాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించి పెట్టాడు (1 సమూ 17:17-54). విజయ సాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాకుండా ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తిలో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తి స్థానం దేవుడే! దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు. కాళ్లు, చేతులు లేని వారిని ఈ లోకం వికలాంగులంటుంది. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు శక్తి కూడా తనదేనన్న గ్రహింపులేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్మ సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలియదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల దేవుని సమయానికి, సంకల్పానికి తలవంచే ఆత్మీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే. దేవుని నిర్ణయాల్లో పొరపాట్లుండవు. ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్