Malaika Arora Stopped By 3 Girls On Road, Watch Viral Video - Sakshi
Sakshi News home page

Malaika Arora: హీరోయిన్‌ను అడుగు ముందుకు వేయనివ్వని అమ్మాయిలు, వీడియో వైరల్‌

Published Fri, May 19 2023 1:45 PM | Last Updated on Fri, May 19 2023 2:03 PM

Malaika Arora Stopped By 3 Girls On Road, Watch Video - Sakshi

సెలబ్రిటీలు కామన్‌ మ్యాన్‌లా జాలీగా బయట తిరగలేరు. నచ్చినచోటికి వెళ్లి షాపింగ్‌ చేయలేరు. గడప దాటి అడుగు బయట పెడితే చాలు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లంటూ అభిమానులు మీదపడిపోతుంటారు. వారిని దాటుకుని ముందుకు వెళ్లడమే వాళ్లకు పెద్ద టాస్క్‌ అయిపోతుంది. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరాకు కూడా ఇలాంటి టాస్కే ఎదురైంది.

గురువారం రాత్రి రెస్టారెంట్‌కు వెళ్లిన హీరోయిన్‌ బయటకు రాగానే అక్కడున్న కొందరు ఆమెను ముప్పుతిప్పలు పెట్టారు. తనను అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకున్నారు. ఏదో ఇవ్వమంటూ ఆమె వెంటపడ్డారు. తను కుదరదని తిరస్కరించినా వినిపించుకోకుండా కారు దగ్గరే నిలబడ్డారు. కారు డోర్‌ కూడా వేయనివ్వకుండా అడ్డుగా నిల్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిల చర్యపై మండిపడుతున్నారు.

ఇది సరైన పద్ధతి కాదు. ఆ పిల్లలు అలా చేసి ఉండాల్సింది కాదు, ఒకరిని వేధించడం మీకు సరదాగా ఉందా? వీళ్లెప్పుడూ అంతే, అక్కడికి ఏ సెలబ్రిటీ వచ్చినా వేధింపులకు గురి చేస్తూనే ఉంటారు, వారి వస్తువులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కానీ సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వెంటపడి వేధిస్తారు, కెమెరా ముందు ఓవరాక్షన్‌ చేస్తారు అని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే మలైకా అరోరా.. గతంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను పెళ్లాడింది. కొంతకాలానికే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా వయసులో తన కంటే చిన్నవాడైన నటుడు అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని వీళ్లిద్దరూ అధికారికంగా వెల్లడించారు. కానీ పెళ్లెప్పుడు? అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంచారు. ఈ మధ్యే వీరు బెర్లిన్‌, ఆస్ట్రియాకు విహార యాత్రకు కూడా వెళ్లొచ్చారు. కాగా మలైకా ఇటీవలే తేరా కీ ఖాయల్‌ అనే మ్యూజిక్‌ వీడియోలో నటించింది. మూవింగ్‌ ఇన్‌ విత్‌ మలైకా అనే షో కూడా చేసింది. ఇది కాకుండా తనకు యోగా స్టూడియో కూడా ఉంది.

చదవండి: సినిమాలకు రజనీకాంత్‌ గుడ్‌బై, అదే చివరి సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement