దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!! | Malaika Arora Welcomes New Year With Arjun Kapoor | Sakshi
Sakshi News home page

అర్జున్‌తో ఫొటో షేర్‌ చేసిన మలైకా

Published Wed, Jan 1 2020 5:51 PM | Last Updated on Wed, Jan 1 2020 5:54 PM

Malaika Arora Welcomes New Year With Arjun Kapoor - Sakshi

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా మరోసారి ట్రోల్స్‌ బారిన పడ్డారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ప్రియుడు, బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేయడమే ఇందుకు కారణం. న్యూ ఇయర్‌ వేడుకలను ఈ జంట ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో అర్జున్‌ను ముద్దాడుతున్న ఫొటోను మలైకా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘సూర్యుడు, నక్షత్రాలు, వెలుగు, సంతోషం... 2020’ అంటూ నెటిజన్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మలైకా షేర్‌ చేసిన ఫొటోపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. 

ముఖ్యంగా మలైకా- అర్జున్‌ల మధ్య ఉన్న వయోభేదాన్ని ప్రస్తావిస్తూ.. ‘ తల్లీ కొడుకుల ప్రేమ చాలా బాగుంది. అయితే మీకు దిష్టి తగులుతుందేమో జాగ్రత్త. అయినా అంత చిన్నవాడిని ఎలా పడేశావు’ అంటూ విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. కాగా పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్‌ జంట మలైకా అరోరా- అర్బాజ్‌ ఖాన్‌ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.  అర్జున్‌ కపూర్‌ కారణంగానే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని బీ- టౌన్‌లో వార్తలు వినిపించాయి. అయితే విడాకులకు ముందు గుట్టుచప్పుడుగా ఉన్న మలైకా- అర్జున్‌లు ఇటీవల బాహాటంగానే కలిసి తిరుగుతుండటంతో వారు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని రూమర్లు వ్యాపించాయి. అయితే వీరు మాత్రం పెళ్లి విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా అర్జున్‌ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దవారన్న విషయం తెలిసిందే.

Sun,star,light,happiness.......2020✨

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement