నువ్వు వర్జినా? కుమారుడిని ప్రశ్నించిన హీరోయిన్‌ | Malaika Arora Asks Son Arhaan When He Lost Virginity, Watch | Sakshi
Sakshi News home page

నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్‌ తనయుడు

Published Wed, Apr 17 2024 12:35 PM | Last Updated on Wed, Apr 17 2024 5:28 PM

Malaika Arora Asks Son Arhaan When He Lost Virginity, Watch - Sakshi

హీరోయిన్‌, ఐటం గర్ల్‌ మలైకా అరోరా కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ యూట్యూబ్‌లో దంబ్‌ బిర్యానీ పేరిట పాడ్‌కాస్ట్‌ ప్రారంభించాడు. బిర్యానీ అనే పేరుకు తగ్గట్లే మాస్‌ మసాలా ప్రశ్నలతో అతిథులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఫస్ట్‌ ఎపిసోడ్‌లో తండ్రి అర్బాజ్‌ ఖాన్‌ ఉండగా రెండో ఎపిసోడ్‌లో తల్లి మలైకా అరోరా ఉంది. రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ చేశాడు అర్హాన్‌.

అమ్మను ఇరకాటంలో పడేసిన కుమారుడు
అయితే వీడియో ప్రారంభంలో మలైకానే హోస్ట్‌గా మారిపోయినట్లు కనిపిస్తోంది. నువ్వు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్‌? అని కుమారుడిని ప్రశ్నించింది. దానికతడు బిగుసుకుపోగా, నాకు సరైన సమాధానం కావాలని పట్టుబట్టింది. దీంతో అర్హాన్‌.. అమ్మా, ముందు నాకీ విషయం చెప్పు.. నువ్వెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావ్‌? అని అడిగాడు. టీజర్‌లో మలైకా ఏమని సమాధానం చెప్పిందో చూపించలేదు.

19 ఏళ్లకు విడాకులు
కాగా మలైకా, అర్బాజ్‌ ఖాన్‌.. 1998లో పెళ్లి చేసుకున్నారు. 2002లో వీరికి అర్హాన్‌ జన్మించాడు. 2008లో ఈమె తన భర్త అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి అర్బాజ్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ అనే బ్యానర్‌ కూడా ప్రారంభించింది. ఈ నిర్మాణ సంస్థలోనే దబాంగ్‌ వంటి పలు సూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించారు. కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరు 2016లో విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అర్బాజ్‌ ఇటీవలే మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. అటు మలైకా.. నటుడు అర్జున్‌ కపూర్‌తో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉంది.

Read this article in English

చదవండి: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్‌ ‍అప్పుడేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement