ముంబై: బాలీవుడ్ నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కలిసి ఎన్నో పార్టీలు చేసుకోవడమే కాక ఏ కార్యక్రమమైనా కలిసే వెళ్లేవారు. అయితే ఈసారి మాత్రం వీళ్లు ఎక్కడెక్కడో బయట తిరగకుండా నేరుగా మలైకా ఇంటికి వెళ్లారు. మలైకా.. కొడుకు అర్హాన్ ఖాన్‌ను, ప్రియుడు అర్జున్‌ను వెంటేసుకుని ముంబైలోని తన తల్లిగారింటికి డిన్నర్‌కు వెళ్లింది. అక్కడే ఈ లవ్ కపుల్‌తో పాటు కుటుంబం అంతా కలిసి భోజనం చేసింది. ఈ డిన్నర్‌కు మలైకా అక్క అమృత కుటుంబం కూడా హాజరైంది. ఇక భోజనం అనంతరం బయటకు అడుగుపెట్టిన మలైకా, అర్జున్‌ల ఫొటోలను క్లిక్‌మనిపించగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ప్రేమికుల దినోత్సవం నాడు ఈ ప్రేమ జంట రొమాంటిక్ డిన్నర్‌ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మలైకా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇదిలా వుంటే ఆమె చివరగా ఇండియా బెస్ట్ డ్యాన్సర్ షోకు జడ్జిగా కనిపించింది. అటు అర్జున్ కపూర్ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్', 'భూత్ పోలీస్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment