బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బర్త్‌డే సందర్భంగా బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అతడి కజిన్స్ సోనమ్ కపూర్, జాన్వీ కపూర్‌లు సైతం ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇక అతడి ప్రియురాలు, నటి మలైక అరోరా చెప్పిన స్పెషల్‌గా బర్త్‌డే విష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మలైక అర్జున్‌ను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్’ అంటూ రెడ్ హర్ట్ ఎమోజీని జత చేసింది.
కాగా సరిగ్గా ఇదే రోజు అంటే అర్జున్ 33వ బర్త్‌డే సందర్భంగా వీరి రిలేషన్ షిప్‌ను అధికారికంగా ప్రకటించారు ఈ లవ్ బర్ట్స్. ఇక అప్పటి నుంచి ఈ జంట బి-టౌన్‌లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ హల్‌చల్ చేస్తుంటాయి. కాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో విడాకుల అనంతరం మలైక అర్జున్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment