Malaika Arora Reveals about her Desire on Beach Wedding in Neha Dhupia's No Filter Neha Show - Sakshi
Sakshi News home page

ఆ విషయంలో అర్జున్‌ నన్ను ఏడిపిస్తాడు

Published Thu, Nov 7 2019 5:13 PM | Last Updated on Thu, Nov 7 2019 5:49 PM

Malaika Arora Reveals About Her Beach Wedding - Sakshi

‘చయ్యచయ్య’ వంటి ఐటెంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు, కెవ్వుకేక అంటూ ఇటు టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేని భామ మలైకా అరోరా. నేహాధూపియాతో చిట్‌చాట్‌ షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సముద్రతీరంలో పెళ్లి చేసుకోవాలనుందని ఆమె తెలిపారు. జీవితాంతం గుర్తుండిపోయే ఆ రోజు కోసం లెబనీస్‌ డిజైనర్‌ ఎలీ సాబ్‌ రూపొందించిన తెల్లటి గౌనులో పెళ్లికూతురుగా ముస్తాబవాలని కోరకుంటోంది. ఈ పెళ్లిసందడికి తన స్నేహితురాళ్లు వధువు తరుపున ఉండాలని పేర్కొంది. నేహా ధూపియా మలైకా బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఆరా తీయగా తనకు అర్జున్‌ కపూర్‌ సరైనవాడని పేర్కొంది.

‘తనకు ఫొటోలు తీయడం రాదని అర్జున్‌ ఏడిపిస్తాడు. కానీ నిజంగానే అతను నాకన్నా బాగా తీస్తాడు’ అని మలైకా చెప్పుకొచ్చింది. కాగా అర్జున్‌కపూర్‌, మలైకా అరోరాలు గతకొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పటినుంచే పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకుంది. ఇక బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్భజ్‌ ఖాన్‌తో మలైకా మొదటి భర్త కాగా కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆమె ప్రేమిస్తున్న అర్జున్‌ కపూర్‌..ఆమె కన్నా 12 సంవత్సరాలు చిన్నవాడు కావటం గమనార్హం. మొత్తానికి వీరిద్దరూ త్వరలోనే వివాహానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement