
వాచ్‌తో వావ్ అనిపించిన అర్జున్ కపూర్
ముంబై : ఖరీదైన దుస్తులు, యాక్సెసరీస్‌తో ఆకట్టుకోవడంలో బాలీవుడ్ భామలకు తామేమీ తీసిపోమని హీరోలు సైతం స్టైలిష్ లుక్ కోసం భారీ ఖర్చుకు వెనుకాడటం లేదు. మలైకా అరోరాతో అనుబంధంతో వార్తల్లో నిలిచిన అర్జున్ కపూర్ తాజాగా లగ్జరీ వాచ్ ధరించి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు.
న్యూయార్క్‌లో ఇటీవల విహరించిన అర్జున్‌కపూర్ తన ఫోటోగ్రాఫ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో అర్జున్ లుక్ కంటే ఆయన చేతి వాచీనే సోషల్ మీడియా ఫోకస్ పెట్టింది. అర్జున్ ధరించిన రోలెక్స్ ట్రెండీ మోడల్ వాచ్ ధర రూ 27 లక్షల పైమాటే. వాచ్ ప్రేమికులు ఈ వాచ్‌ను చూసి వావ్ అంటుంటే..మరికొందరు నెటిజన్లు ఇంతటి షో అవసరమా అంటూనే వాచ్ మాత్రం చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు.