ఎంతోసేపటిదాకా ఏడుస్తూనే ఉండిపోయా: హీరోయిన్‌ | Malaika Arora On World Mental Health Day: I Survived Storm Within Me | Sakshi
Sakshi News home page

Malaika Arora: అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.. బాలీవుడ్‌ హీరోయిన్‌

Published Sat, Oct 9 2021 8:28 PM | Last Updated on Sat, Oct 9 2021 8:39 PM

Malaika Arora On World Mental Health Day: I Survived Storm Within Me - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన గబ్బర్‌ సింగ్‌ సినిమాలో 'కెవ్వు కేక' అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడి అలరించింది మలైకా అరోరా. నటిగా, నిర్మాతగా, డ్యాన్సర్‌గా అన్ని రకాలుగా ఆకట్టుకుంటున్న మలైకా తాజాగా తన జీవితంలోని దుర్భర పరిస్థితులను తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. అక్టోబర్‌ 10న మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖ పోస్ట్‌ చేసింది. 

'నన్ను నేను బుల్లెట్‌ ప్రూఫ్‌ అనుకున్నాను, కానీ ఎమోషన్స్‌ ఆపుకోలేనని తర్వాత అర్థమైంది! నా మైండ్‌ నన్ను ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం మొదలుపెట్టింది. కేవలం యోగా వల్లే దాని నుంచి బయటపడ్డా. ఒకరోజు నేను యోగా క్లాస్‌లో ఉన్నప్పుడు కళ్ల నుంచి నీళ్లు జలపాతంలా వర్షిస్తూనే ఉన్నాయి. నాలో చెలరేగిన తుపానులాంటి పరిస్థితిని నేను జయించాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ నన్ను బుల్లెట్‌ ప్రూఫ్‌ అని చెప్పుకోలేదు. ఎందుకంటే ఎమోషన్స్‌ను ఆపుకునే శక్తి మనలో ఎవరికీ లేదు గనక! నిరంతరం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను' అని రాసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement