
Malaika Arora- Beauty Tips: డెడ్ స్కిన్‌తో ముఖం నిర్జీవంగా మారి ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. అలాంటి వాళ్ల కోసం బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా సహజమైన చిట్కాలు చెప్పారు. మృత చర్మం తొలగి ముఖం మిలమిలా మెరిసిపోయేందు తాను పాటించే టిప్స్ గురించి పంచుకున్నారు.
నేనైతే ఇలా చేస్తా
‘‘డెడ్ స్కిన్‌ను రిమూవ్ చేయడానికి స్క్రబ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటా. కాఫీ పొడి, బ్రౌన్ షుగర్, కొన్ని చుక్కల కొబ్బరి నూనె, కొన్ని చుక్కల బాదం ఆయిల్.. అన్నీ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టిస్తా. రిజల్ట్స్.. మిలమిలా మెరిసిపోయే నేనే! ఈ చిట్కా మా అమ్మ చెప్పిందే!!’’ అంటూ మలైకా తన మెరిసే చర్మం వెనుక గల రహస్యాన్ని పంచుకున్నారు.
‘‘చెయ్య.. చెయ్య..’’ సాంగ్‌లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌తో ఆడిపాడి యూత్ దగ్గరైన నటి మలైకా అరోరా. మాజీ భర్త ఆర్బాజ్ ఖాన్‌తో కలిసి పలు సినిమాలు నిర్మించిన ఆమె పలు టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక తన కంటే 12 ఏళ్ల చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్న ఈ 49 ఏళ్ల నటి తరచూ అతడితో ఫొటోలు పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉంటారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఆమె తన వర్కౌట్ వీడియోలు కూడా పంచుకుంటూ ఉంటారు.
చదవండి: Mithila Palkar: ఈ నటి ధరించిన డ్రెస్ ధర 74,975! ఏకయా బ్రాండ్ స్పెషాలిటీ అదే
How To Prevent Acne: గోధుమ పిండితో ట్యాన్‌కు చెక్! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తే జరిగేది ఇదే!
Comments
Please login to add a commentAdd a comment