‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’ | Arbaaz Khan Said Son Arhaan Keeps Us Bonded | Sakshi
Sakshi News home page

మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి: అర్బాజ్‌

Jul 20 2019 4:07 PM | Updated on Jul 20 2019 4:25 PM

Arbaaz Khan Said Son Arhaan Keeps Us Bonded - Sakshi

విడాకులు తీసుకున్నంత మాత్రాన మేం ద్వేషించుకుంటున్నట్లు కాదు అంటున్నారు నటుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌. ఇప్పటికి తన మాజీ భార్య మలైకాతో, ఆమె కుటుంబ సభ్యులతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు అర్బాజ్‌. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మేమిద్దరం చాలా ఏళ్లు కలిసి జీవించాం. మా మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మాకు పిల్లలు ఉన్నారు. కాబట్టి ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండలేం అనుకున్నాం. కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయాం. దానర్థం మేం ఒకర్నొకరం ద్వేషించుకుంటున్నట్లు కాదు. ఇద్దరం హుందాగా పరిస్థితుల్ని చక్కదిద్దుకున్నాం. ఇప్పుడు కూడా మలైకా కుటుంబ సభ్యులతో నేను స్నేహంగానే ఉన్నా. పిల్లలు పెద్దయ్యే సరికీ అన్నీ చక్కబడతాయి. మా కుమారుడు అర్హాన్‌ మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’ అన్నాడు అర్బాజ్‌.

అర్బాజ్‌, మలైకా 1998లో వివాహం చేసుకున్నారు. కానీ అభిప్రాయబేధాల వల్ల 2017లో విడిపోయారు. తమ 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు అధికారికంగా వెల్లడించారు. ముందు చూపుతో ఆలోచించి, పరిస్థితులకు అనుగుణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మలైకా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కుమారుడు అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అర్జున్‌ కూడా పరోక్షంగా ఒప్పుకొన్నారు. అర్బాజ్‌ కూడా ఇటలీకి చెందిన ఓ మోడల్‌ను ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు. కానీ ఆమె పేరు బయటపెట్టలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement