Malaika Arora open Up About Criticised For Her Dreesing Goes Viral - Sakshi
Sakshi News home page

Malaika Arora: అది నా వ్యక్తిగతం..ఆ హక్కు ఎవరికీ లేదు: స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌

Published Sun, Jan 23 2022 11:43 AM | Last Updated on Sun, Jan 23 2022 12:28 PM

Malaika Arora open Up About Criticised For Her Dreesing - Sakshi

I am not stupid, cannot live according to people: బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. టాలీవుడ్‌ ఆడియన్స్‏కు కూడా ఆమె సుపరిచితమే. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఆమె ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. ఆమె ధరించే దుస్తులు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ భామ సినిమాల కంటే డ్రెస్సింగ్‌ విషయంలోనే ఎక్కువగా ట్రోల్‌ అవుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డ్రెస్సింగ్‌ తనపై వచ్చిన విమర్శలపై స్పదించింది.

‘ఒక స్త్రీని ఎల్లప్పుడూ ఆమె ధరించే స్కర్ట్ పొడవు లేదా ఆమె నెక్‌లైన్‌ని బట్టి అంచనా వేస్తారు. జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని గడపలేను. ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది నా వ్యక్తిగత ఎంపిక. మీరు ఒక నిర్దిష్ట విధానంలో ఆలోచించవచ్చు కానీ అది నా కోసం కాకపోవచ్చు. కాబట్టి నేను ఎవరికీ అలాంటి విషయాల గురించి చెప్పను. నాకు నా సొంతంగా ఆలోచనలు, ఎంపికలు ఉంటాయి. అందుకే నేను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడను. నేను ఎలాంటి దుస్తులు ధరించాలి? ఏ డ్రెస్‌ సెట్‌ అవుతుందో, ఏది బాగోదో నాకు బాగా తెలుసు. రేపు ఇది బాలేదు అని నాకు అనిపిస్తే నేను అది చేయను. కానీ అప్పుడూ కూడా అది నా ఎంపిక. కాబట్టి దాని గురించి నాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నా వయసుకి, నేను ధరించే దుస్తుల పట్ల నాకు సౌకర్యంగానే ఉంది. నేను తెలివితక్కువదానిని కాదు. ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకు తెలుసు. నాకు నచ్చినట్లుగా నేను ఉంటా’అంటూ మలైకా చెప్పుకొచ్చింది. 

 1998లో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్‌ కూడా వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement