మలైకా అరోరా అపార్ట్‌మెంట్‌ అద్దెకు.. రెంట్ ఎంతంటే? | Malaika Arora Rents Mumbai Apartment Details | Sakshi
Sakshi News home page

మలైకా అరోరా అపార్ట్‌మెంట్‌ అద్దెకు.. రెంట్ ఎంతంటే?

Published Fri, May 17 2024 2:29 PM | Last Updated on Fri, May 17 2024 3:14 PM

Malaika Arora Rents Mumbai Apartment Details

ప్రముఖ నటి 'మలైకా అరోరా' ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్‌ నెలవారీ రెంట్ రూ. 1.57 లక్షలు. అయితే ఓ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది.

అద్దెదారు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు, మూడవ సంవత్సరంలో నెలకు రూ. 1.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెదారు కాశిష్ హన్స్  4.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది.

మలైకా అరోరా తన అపార్ట్‌మెంట్‌లను అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో యజమాని జెఫ్రీ గోల్డెన్‌బర్గ్‌కు నెలకు రూ.1.2 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు మరోమారు తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement