
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ అభిమానులకు జాగ్రత్తగా ఉండాలంటూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా నటి మలైకా అరోరా కూడా తన అభిమానులను కరోనా వైరస్ నుంచి సంరక్షించుకోవాలంటూ సూచనలు ఇచ్చారు. మనల్ని మనం సంరక్షించుకోవాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంటి బయట ఉన్నప్పుడు వైరస్ బారిన పడకుండా మనం, మనవారు జాగ్రత్తగా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతూ... మలైకా చేతులపై శానిటైజర్‌ను వేసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
‘హాలో గాయ్స్... ఇది నేను ఏదో సరదా కోసం చెబుతున్న విషయం కాదు. ప్రస్తుత ప్రపంచ దేశాలు భయంతో పోరాతుడుతున్న ప్రాణాంత వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాంటే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. దీని నుంచి మనమే కాకుండా కుటుంబ సభ్యులను, సన్నిహితులకు, స్నేహితులను కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వారిని పరిశ్రుభంగా ఉంచడమే కాకుండా భయపడకుండా ఉండేందుకు మన వంతు కృషి చేయాలి’ అంటూ రాసుకొచ్చారు. అంతేగాక ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిశుభ్రత పద్ధతులను నిరంతరం ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇందుకోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఒకవేళ వెళితే మాస్క్‌లు ధరించాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక దీని గురించి ఆందోళన చెందకుండా ఉండాలి. అలాగే మనవారిని కూడా ప్రశాంతంగా ఉండమని చెప్పండి’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment