Arjun Kapoor Response On Trolls Over Dating With Malaika Arora - Sakshi
Sakshi News home page

Arjun Kapoor: ఆంటీతో డేటింగ్‌ అంటూ ట్రోల్స్‌, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్‌ హీరో

Published Mon, Jan 3 2022 1:45 PM | Last Updated on Mon, Jan 3 2022 3:52 PM

Arjun Kapoor Response On Trolls - Sakshi

Arjun Kapoor Response On Trolls: బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ప్రముఖ నటి మలైకా అరోరాతో కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్‌ కపూర్‌కు 36 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అర్జున్‌ సినిమాల పరంగా కంటే తనకన్నా వయసులో పెద్దదైన మలైకతో ప్రేమ వ్యవహరంతో కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు ఆంటీతో డేటింగ్‌ ఏంటని కూడా తరచూ ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నాడు.

చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్‌ తనయుడు డేటింగ్‌, ఫొటోలు వైరల్‌

అయితే ఈ కామెంట్స్‌ను అర్జున్‌, మలైక ఇంతకాలం చూసి చూడనట్టు వదిలేశారు. అంతేకాదు ట్రోలర్స్‌కు గట్టి సమాధానంగా సమయం వచ్చినప్పుడల్లా వీరిద్దరూ సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇలాంటి కామెంట్స్‌పై స్వయంగా స్పందించాడు అర్జున్‌ కపూర్‌. ఈ సందర్భంగా అర్జున్‌ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి ఇలాంటి వ్యాఖ్యలపై స్పందన కోరుకునేది మీడియా మాత్రమే. సాధారణంగా ట్రోలింగ్స్‌లో తొంభైశాతం కామెంట్స్‌ను అంతగా పట్టించుకోము. చూసి చూడనట్టు వదిలేస్తాం. ఎందుకంటే అవన్ని నిజం కాదు అందులో కొన్ని ఫేక్‌. అదే వ్యక్తులు నన్ను కలిసినప్పుడు నాతో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే వాటిని నమ్మలేం’ అంటూ తనదైన శైలిలో ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్‌ జోహార్‌ ట్వీట్‌, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు

అంతేకాదు.. ‘నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైనా చేస్తాను. అది నా హక్కు. నా పనికి గుర్తింపు లభిస్తే చాలు. మిగిలినదంతా చెత్త. ఎవరి వయస్సు ఎంత అనే దాని గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ వారు జీవించాలి. వయస్సును చూసి రిలేషన్ షిప్‌లోకి దిగడం నాకు తెలిసి ఓ వెర్రితనం’ అని వ్యాఖ్యానించాడు. కాగా, మలైకకు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో వివాహం కాగా వీరికి కుమారుడు ఆర్హాన్‌ ఖాన్‌ ఉన్నాడు. ఇటీవల అర్భాజ్‌, మలైకలు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement