
బాలీవుడ్ నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్‌లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయాక మలైక, అర్జున్‌లు పెళ్లి చేసుకోబుతున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఇక వారి బంధానికి మలైక ఇంట్లో కూడా ఒకే చెప్పిసినట్లు అనిపిస్తోంది ఈ తాజా సంఘటన చూస్తే. మలైకా తల్లి జోయిస్ అరోరా పుట్టిన రోజు సోమవారం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఈ పార్టీకి మలైకాతో పాటు అర్జున్ కూడా హాజరయ్యాడు. అంతేగాక మలైక, అర్భాజ్ ఖాన్‌ల కొడుకు ఆర్హాన్ ఖాన్ కూడా ఈ బర్త్‌డే పార్టీకి హాజరవ్వడం గమనార్హం. మలైకా సొదరి అమ్రితా అరోరా, తన భర్త షాకీల్ లడక్‌లతో కలిసి అర్హాన్ తన అమ్మమ్మ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరయ్యాడు.
చయ్య.. చయ్య.. రీమిక్స్ చేయొద్దయ్యా
కాగా ఇటీవల మలైకా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఆర్హాన్, అర్జున్‌తో తన ప్రేమ బంధాన్ని అంగికరించినట్లు తెలిపారు. ‘ఏలాంటి విషయాన్నైనా నిజాయితీగా ఉంచడమే సరైనదని నేను భావిస్తాను. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనకు సంబంధించిన వారికి చెప్పడం ముఖ్యంగా. అదే విధంగా దానిని అర్థం చేసుకునే సమమాన్ని కూడా వారికి ఇవ్వాలి’ అని చెప్పారు. ఇక ఈ ముగ్గురు కలిసి అప్పడప్పుడు లంచ్‌లకు, పార్టీలకు వెళుతూంటారు. కాగా మలైక ప్రస్తుతం సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ రియాలిటీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్ కాశ్వీ నాయర్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అర్జున్‌కు జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment