బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్ విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితిని మీడియాతో పంచుకున్నాడు. పిల్లలు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం కష్టమని, కానీ తప్పదని పేర్కొన్నాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మలైకా అరోరా, నేను విడిపోయే నాటికి నా కొడుకు అర్హాన్ వయసు 12 సంవత్సరాలు. ఇంట్లో రోజూ ఏం జరుగుతుందనేది వాడికి తెలుసు. వాడిది అర్థం చేసుకునే వయస్సు కాబట్టి విడాకుల గురించి వాడితో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం రాలేదు’ అని తెలిపాడు. అర్హాన్ తనకే దక్కాలని, పూర్తిగా తన దగ్గరే ఉండిపోవాలని ఎప్పుడూ పోరాడలేదని అర్బాజ్ చెప్పుకొచ్చాడు.
పిల్లలకు తల్లి ఎంత అవసరమన్నది తనకు తెలుసని, అందుకే అర్హాన్ మలైకాతో ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదన్నాడు. అర్హాన్‌కు ఇంకో ఏడాది ఆగితే 18 సంవత్సరాలు వస్తాయని, అప్పుడు వాడికి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండవచ్చన్నాడు. కాగా అర్బాజ్‌ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. అభిప్రాయబేధాల వల్ల 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ 2017లో విడిపోయారు. ప్రస్తుతం మలైకా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం జరుపుతుండగా అర్బాజ్ ఖాన్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో డేటింగ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment