అర్బాజ్ను మలైకా ఎలా పడేసింది? | Malaika impressed Arbaaz with her cooking skills? | Sakshi
Sakshi News home page

అర్బాజ్ను మలైకా ఎలా పడేసింది?

Published Sat, Apr 4 2015 4:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

అర్బాజ్ను మలైకా ఎలా పడేసింది?

అర్బాజ్ను మలైకా ఎలా పడేసింది?

ప్రముఖ నటి.. నిర్మాత మలైకా అరోరా ఖాన్ తన ప్రేమకు సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించబోతోంది. 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఆమె ఈ విషయాలు చెబుతుందట. తన భర్త అర్బాజ్ఖాన్తో ప్రేమలో పడేందుకు తాను వండిన వంటకాలు కూడా ఓ కారణమని మలైకా చెబుతోంది. ఆమె అర్బాజ్ఖాన్తో డేటింగ్లో ఉన్న సమయంలో వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ప్రత్యేక వంటకాలు చేసి అతడికి రుచి చూపించిందట.

అప్పటికి తనకు పెద్దగా వంట రాకపోయినా.. ఆ రుచి చూసే అర్బాజ్ ఖాన్ పడిపోయాడని, అదికూడా తమ ప్రేమ పండేందుకు ఓ కారణమని మలైకా చెబుతోంది. 1998లో అర్బాజ్, మలైకా పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అర్హాన్ అనే 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కలర్స్ చానల్లో ప్రసారమయ్యే 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఇలాంటివే మరికొన్ని రహస్యాలను మలైకా అరోరా ఖాన్ చెబుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement