‘సమాధానం రేపు చెప్పనా’ | Arbaaz Khan Reaction To Malaika Arora Arjun Kapoor Wedding Rumours | Sakshi
Sakshi News home page

మాజీ భార్య పెళ్లిపై స్పందించిన అర్బాజ్‌

Published Mon, Apr 1 2019 2:30 PM | Last Updated on Mon, Apr 1 2019 2:41 PM

Arbaaz Khan Reaction To Malaika Arora Arjun Kapoor Wedding Rumours - Sakshi

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో మళ్లీ పెళ్లి వార్తల హవా ఎక్కువయ్యింది. మలైకా అరోరా, హీరో అర్జున్‌ కపూర్లు ఈ నెల 19న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో మలైకా, అర్జున్‌ల పెళ్లి గురించి అర్బాజ్‌ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. విలేకరుల సమావేశంలో భాగంగా ఓ జర్నలిస్ట్‌ అర్బాజ్‌ ఖాన్‌ను ‘వచ్చే నెలలో మీ మాజీ భార్య మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌లు వివాహం చేసుకోబోతున్నరటగా’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే అర్బాజ్‌ ఖాన్‌ ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. దాంతో అక్కడ ఉన్న విలేకరులు కూడా నవ్వడం ప్రారంభించారు.

ఇదే ప్రశ్నను మరో సారి అడగ్గా అందుకు అర్బాజ్‌ ఖాన్‌ ‘ఈ ప్రశ్న అడగడానికి మీరు చాలా సమయం ఆలోచించే ఉంటారు కదా. నేను కూడా బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి కాబట్టి.. రేపు చెప్పనా’ అంటూ ఆన్సర్‌ చెప్పకుండా దాటవేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవోతుంది. ఇదిలా ఉండగా మలైకా, అర్జున్‌ కపూర్‌లు ఈ నెల 19న వివాహం చేసుకోబోతున్నారని.. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం మలైకా బ్యాచిలరేట్‌ పార్టీలో భాగంగా స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Repost @lnbolly Arbaaz reaction on Arjun and Malaikas marriage

A post shared by instabollywoodfc (@lnstabollywoodfc) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement