
ఆ వదంతులు నిజమే: సన్నీ లియోన్
ముంబయి: తనపై ఇటీవల వస్తున్న వదంతులపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చాలా సంతోషంగా ఉంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తో కలిసి సన్నీ నటించనుందని రూమర్స్ ప్రచారం అయ్యాయి. ఆ వదంతులు నిజమేనని సన్నీ చెప్పింది. తన నెక్ట్స్ ప్రాజెక్టులో అర్బాజ్ ఖాన్ తో కలిసి నటిస్తున్నానని, ఆ పేరు తేరా ఇంతేజార్ అని వివరించింది. అతడితో కలిసి నటించనున్నందుకు తనకు చాలా ఉత్సాహంగా ఉందని అంటోంది. జీవితం ఎలా సాగుతుందో చెప్పలేమని, ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుందని సన్నీ లియోన్ వేదాంతం వల్లిస్తోంది.
బాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని, ఆ నటులకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం అవుతుందని అభిప్రాయపడింది. రాజీవ్ వాలియా ఈ మూవీతో కొత్త దర్శకుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. వన్ నైట్ స్టాండ్, మస్తిజాడే మూవీలతో ఇటీవల సన్నీ మరింత జోష్ మీదున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెతో బాలీవుడ్ బాద్షా షారుక్ నటించగా, మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఇప్పటికే సన్నీతో మూవీకి తానెప్పుడూ సిద్ధమేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీవితంలో ఎన్నో మలుపులు ఎదురవుతున్నాయని అవి తనకు సంతోషాన్ని ఇస్తున్నాయని సన్నీ పేర్కొంది.