
ముంబై : తన అన్న సూపర్ స్టార్ అయినా తనకు పాత్రలు వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదని, తాను స్వయంకృషితో బాలీవుడ్‌లో ఈస్ధాయికి చేరుకున్నానని సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ అన్నారు. చాలామంది ఒకట్రెండు సినిమాలతోనే కనుమరుగవుతున్న రోజుల్లో తాను ఇప్పటివరకూ 70 సినిమాలు చేశానని, రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ర్టీలో కొనసాగుతున్నానని అర్బాజ్ చెప్పుకొచ్చారు.
సల్మాన్ తమ్ముడిగా తనకు పని ఇచ్చేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని, సల్మాన్ వలన దర్శక, నిర్మాతలు ఒకట్రెండు సినిమాల్లో అవకాశం ఇస్తారని, నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటేనే ఫలితం ఉంటుందని చెప్పారు. తాను తన సొంత ప్రతిభతోనే ఎదిగానని, పరిశ్రమలో తన కాళ్లపై తాను నిలబడగలిగానని సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తాను పనిచేసుకుంటూ పోతానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాకు ఆదరణ పెరగనుందని, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment