
మరో బాలీవుడ్ జంట కటీఫ్?
మరో బాలీవుడ్ జంట దూరంకాబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా దంపతుల మధ్య మనస్ఫర్థలు ఏర్పడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బాలీవుడ్ దంపతులు ఫర్హానా అక్తర్, ఆధున అక్తర్ ఇటీవల విడిపోయారు.
కొన్ని నెలల క్రితం ముంబై బాంద్రాలోని ఇంటి నుంచి తన కొడుకు అర్హాన్తో కలసి వెళ్లిపోయిన మలైకా.. ఖేర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే మలైకా సోదరి, నటి అమృత అరోరా అత్తమామల నివాసం ఉంది. మలైకా బ్రిటన్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనం. అర్బాజ్, మలైకా మధ్య విబేధాలు ఏర్పడ్డాయని, ఇద్దరూ విడిపోతున్నట్టు పేర్కొంది. మలైకా తెలుగు సూపర్ హిట్ చిత్రం గబ్బర్సింగ్లో ఐటమ్ సాంగ్లో నర్తించిన సంగతి తెలిసిందే.